తెలంగాణా స్పెషల్.. అంకాపూర్ మక్క వడలు.. ఈవెనింగ్ టైంలో కరకరలాడే సూపర్ స్నాక్

Updated on: Apr 13, 2026 | 7:00 AM

Ankapur makka vada in Telugu: అంకాపూర్ చికెన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటి లాగే ఇక్కడి వడలకు కూడా ఫేమస్. ఇవి కరకరలాడే లాడుతూ ఉంటాయి. నోరురించే అంకాపూర్ మక్క వడలు తినడానికి ప్రజలు కూడా అసక్తి చూపుతున్నారు.

1 / 5

కావాల్సిన పదార్ధలు: ఒక కప్పు మొక్కజొన్న గింజలు, రెండు కప్పులు బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి,  అల్లం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు ఆకులు, పుదీనా,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా 
ఉప్పు, అర గ్లాస్ నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధలు: ఒక కప్పు మొక్కజొన్న గింజలు, రెండు కప్పులు బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు ఆకులు, పుదీనా, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అర గ్లాస్ నూనెను తీసుకోవాలి.

2 / 5
 అంకాపూర్ మక్క వడలు తయారీ విధానం: మిక్సీ జార్‌ తీసుకుని మొక్కజొన్న గింజలు, నాలుగు  పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి, నీళ్లు పోయకుండా వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

అంకాపూర్ మక్క వడలు తయారీ విధానం: మిక్సీ జార్‌ తీసుకుని మొక్కజొన్న గింజలు, నాలుగు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి, నీళ్లు పోయకుండా వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

3 / 5

పిండిని ఈ విధంగా కలుపుకోవాలి:  ఈ మిశ్రమాన్ని తీసుకుని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఆకులు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు,  బియ్యం పిండిని వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
ఆ తరువాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని, పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, ప్లాస్టిక్ కవర్ పైన చిన్న వడలుగా వాటిని ఒత్తుకోవాలి.

ఆ తరువాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని, పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, ప్లాస్టిక్ కవర్ పైన చిన్న వడలుగా వాటిని ఒత్తుకోవాలి.

5 / 5
ఇలా వేయించుకోవాలి: పాన్ లో ఆయిల్ వేసి, సన్నని మంట పై  ఉంచి, చేతులతో చేసిన వడలను తీసుకుని దానిలో వేసి  రెండు వైపులా గోల్డ్ రంగులోకి మారే  వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇలా వేయించుకోవాలి: పాన్ లో ఆయిల్ వేసి, సన్నని మంట పై ఉంచి, చేతులతో చేసిన వడలను తీసుకుని దానిలో వేసి రెండు వైపులా గోల్డ్ రంగులోకి మారే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.

Follow Us