
చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గం షావోమీ తాజాగా ల్యాప్‌టాప్ సిరీస్‌ను లాంచ్ చేసింది. షావోమీ బుక్ ప్రో 2022 సిరీస్‌లో భాగంగా రెండు మోడల్స్‌ను లాంచ్ చేసింది. 14 ఇంచెస్, 16 ఇంచెస్ డిస్‌ప్లేలతో రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేశారు.

14 ఇంచెస్ ల్యాప్‌ట్యాప్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో E4 OLED టచ్ డిస్‌ప్లేను అందించారు. 2వ జనరేషన్ ఇంటెక్ కోర్ పీ సిరీస్ ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పని చేస్తుంది. స్టోరేజ్ విషయానికొస్తే.. గరిష్ఠంగా 16జీబీ ర్యామ్, 512 SSD స్టోరేజ్ ఉంది.

ఈ ల్యాప్ ట్యాప్ 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ అందించడం విశేషం. ఇక 14 ఇంచెస్ ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో కూడా E4 OLED రెటీనా మాస్టర్ టచ్ డిస్‌ప్లేతో ఇచ్చారు.

ఈ ల్యాప్‌ట్యాప్‌లో 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5, i7 ప్రాసెసర్ వేరియంట్లతో అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్ కూడా 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ధర విషయానికొస్తే 14 ఇంచెస్ i5 మోడల్ ల్యాప్‌ట్యాప్ రూ. 80,000, i7 ప్రారంభ ధర రూ. 1,00,000గా ఉంది. ఇక 16 ఇంచెస్ ల్యాప్‌ట్యాప్ i5 వెర్షన్ రూ. 87,000, i7 వెర్షన్ రూ. 1,10,700గా ఉంది.