
ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ వింగ్స్.. 'ఫ్లోబడ్స్ 200 టీడబ్ల్యూఎస్' పేరుతో కొత్త ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఇయర్ బడ్స్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 899గా ఉంది. ఇయర్ బడ్స్‌కు సెమీ ట్రాన్స్‌పరెంట్ కేస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ధర తక్కువే అయినా ఈ కేస్ ఇయర్ బడ్స్‌కు రిచ్ లుక్‌ను తీసుకొచ్చాయి.

ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 13mm హై-ఫిడిలిటీ డ్రైవర్‌లను అందించారు. టచ్ కంట్రోల్‌తో పని చేయడం వీటి ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఫ్లోబడ్స్ 200లో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించారు. చుట్టు పక్కల ఎంత సౌండ్ డిస్టబెన్స్ ఉన్నా వాయిస్ స్పష్టంగా వినిపించడం ఈ టెక్నాలజీ సొంతం.

ఇక ఇందులో 40 ఎమ్‌ఎస్ వరకు లెటెన్సీ ఉంటుంది. దీంతో స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ ఆడుకునే వారికి మంచి సౌండ్ ఎఫెక్ట్ అనుభూతిని పొందొచ్చు. అంతేకాకుండా దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం IPX5 రేటింగ్‌ను ఇచ్చారు.