ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రైవసీకి పెద్ద పీట వేసిన వాట్సాప్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది వాట్సాప్. ఇప్పటి వరకు ఉన్న డిలీట్ ఎవ్రీ వన్ ఫీచర్‌తో మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తికి కూడా డిలీట్ అయ్యేలా చేసుకునే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఈ ఫీచర్‌తో మెసేజ్‌ను డిలీట్ చేయాలంటే కొద్ది సమయం వరకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని ఎత్తేసే యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంటే ఇకపై మీరు ఎదుటి వ్యక్తికి పంపించిన ఫొటో, వీడియోను సమయంతో సంబంధం లేకుండా మీకు నచ్చినప్పుడు డిలీట్ చేసుకునే అవకాశం కలగనుందన్నమాట.
2017లో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌కు మొదట్లో టైం లిమిట్ 7 నిమిషాలు మాత్రమే ఉండేది, ఆ తర్వాత గంటకు పెంచారు. ఇప్పుడు పూర్తిగా సమయాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారు.
త్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌కు యూజర్లు ఏమేర పెరుగుతారో చూడాలి.