వాట్సాప్‌లో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన ఫీచర్స్‌లో గ్రూప్ కాల్స్ ఒకటి. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఒక చోట చేరి ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు అందించింది వాట్సాప్.
ఇప్పటి వరకు ఈ గ్రూప్ కాల్స్‌లో ఒకేసారి 15 మంది యూజర్లు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉందని తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ ఇందులో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.
వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌తో ఇకపై వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో గరిష్టంగా 32 మంది పాల్గొనే అవకాశం లభించనుంది. దీంతో ఒకే సారి 31 మంది గ్రూప్ కాల్స్‌లో మాట్లాడుకోవచ్చన్నమాట.
కాల్స్ ట్యాబ్‌కు అప్‌డేట్‌తో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి 2.23.19.16 బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇదిలా ఉంటే యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తున్న వాట్సాప్ ఇందులో భాగంగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే బీటా టెస్టర్‌లకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కోసం 'ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్ వెరిఫికేషన్' ఫీచర్‌ను తీసుకురానుంది.