Google Search History: ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే ప్రతి ఒక్కరు గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఏ సమాచారం కావాలన్న గూగుల్ సులభంగా సమాధానం ఇచ్చేస్తుంది. కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం Googleని అడగడం కొన్నిసార్లు మీరు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కొన్ని పదాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏకంగా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఐటీ నియమాలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పబ్లిక్ డొమైన్‌లో శోధించడం నిషేధించబడిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంటర్నెట్‌లో శోధిస్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అంశాలు ఏమిటో తెలుసుకుందాం.
పొరపాటున కూడా గూగుల్‌లో పిల్లలకు సంబంధించిన ఏదైనా అసభ్యకరమైన కంటెంట్‌ను వెతకడానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం నేరం. ఇందు కోసం కఠినమైన చట్టం ఉంది. ఒక వ్యక్తి ఇలా చేస్తూ పట్టుబడితే ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ కేసులో ఆ వ్యక్తి ఐదు నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఎవరైనా గూగుల్‌లో బాంబును ఎలా తయారు చేయాలో సెర్చ్ చేస్తే చిక్కుల్లో పడినట్లే. ఇలాంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే భద్రతా ఏజెన్సీల రాడార్‌పైకి రావచ్చు. ఇలాంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేయకపోవడం మంచిది. లేకుంటే ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.
ఒక వ్యక్తి గూగుల్ సెర్చ్ సహాయంతో ఇంటర్నెట్‌లో హ్యాక్ చేయడానికి మార్గం కోసం వెతికితే, అది గూగుల్‌కు నచ్చదు. అలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో జైలు శిక్ష పడవచ్చు. ఈ మూడు విషయాలు గూగుల్ లో సెర్చ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది.
డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడంలో సైబర్ భద్రతా సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌లో పాల్గొనే వ్యక్తులను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి అనేక దేశాలు బలమైన వ్యవస్థలను అమలు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలు తరచుగా నేర కార్యకలాపాలకు సంబంధించిన కీలకపదాలు లేదా నమూనాలను గుర్తించడానికి అధునాతన అల్గారిథమ్‌లు, AI- ఆధారిత సాధనాలను ఉపయోగిస్తాయి.