Vivo Pad 3: వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..

|

Jul 01, 2024 | 10:09 PM

ప్రస్తుతం మార్కెట్లో ట్యాబ్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఓటీటీ వీడియోలు స్ట్రీమింగ్‌, గేమింగ్‌తో పాటు ఎడ్యుకేషన్‌ పరంగా ట్యాబ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొంగొత్త ట్యాబ్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వివో కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. వివో ప్యాడ్‌ 3 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చారు. వివో ప్యాడ్ 3 టాబ్లెట్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్‌ చేశారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను తీసుకురానున్నారు.

2 / 5
ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జనరేషన్‌ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 12.1 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 600నిట్స్ బ్రైట్‌నెస్‌ని ఇచ్చారు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ పనిచేస్తుంది. ఇందులో 44 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 10,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,700, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 35 వేలకిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ట్యాబ్‌ బరువు 589.2 గ్రాములుగా ఉంది.

5 / 5
కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వై-ఫై 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-సి పోర్ట్‌ను అందించారు.