చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. వివో వి27 పేరుతో త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది.
వివో వీ27 సిరీస్‌లో భాగంగా వివో వీ27, వీ27ప్రొను కంపెనీ లాంఛ్ చేయనున్నారు. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా పంచుకోలేదు. అయితే కొన్ని ఫీచర్లను మాత్రమే వెల్లడించింది.
వివో వీ27 స్మార్ట్ ఫోన్‌లో వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పంచ్ హోల్ డిజైన్‌తో ముందు భాగంలో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు.
కెమెరా విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హై క్వాలిటీతో తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో మెరుగైన్ పోర్ట్రయిట్ షాట్స్ తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇక ధర విషయానికొస్తే రూ. 42,000గా ఉండొచ్చని అంచనా. అయితే లాంచింగ్ సమయంలో ఆఫర్ కింద రూ. 40,000లోపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అంచనా వేస్తున్నారు.