Earthquake: భూకంపాలను ముందుగానే గుర్తించగలిగితే.. సాధ్యమే అంటోన్న ఏఐ టెక్నాలజీ

|

Oct 13, 2023 | 6:54 PM

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంకింగ్ మొదలు ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం భారీగా పెరిగింది. టెక్‌ కంపెనీలు సైతం కృత్రిమ మేథాను ఉపయోగిస్తున్నారు. సేవలను మరింత సులభతరం చేస్తూ మనిషి జీవితాన్ని మార్చేసింది ఏఐ. పనులను సులభతరం చేయడమే కాదు, మనుషుల ప్రాణాలను సైతం కాపాడుతోంది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌...

1 / 5
ప్రతీ ఏటా భూకంపాల కారణంగా వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. అయితే భూకంపాలను ముందుగానే గుర్తించగలిగితే ఎంతో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని తెలిసిందే. దీనికి చెక్‌ పెట్టేందుకు టెక్నాలజీ సహాయం చేస్తోంది.

2 / 5
యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు భూకంపాలను ముందుగానే గుర్తించే కృత్రిమ మేధతో కూడిన ఆల్‌గరిథంను రూపొందించారు. ఈ ఆల్‌గరిథం దాదాపు 70 శాతం కచ్చితత్వంతో భూకంపాలను అంచనా వేయగలదు.

3 / 5
గతలో భూకంపాలు వచ్చిన సమయంలో నమోఏ సీస్మోగ్రాఫ్‌ ఇన్మర్మేషన్‌ ఆధారంగా ఆల్‌గరిథంను రూపొందించారు. దీంతో సీస్మిస్‌ సమాచారంలో వచ్చే గణాంకాల హెచ్చుతగ్గులను అంచనా వేసేలా డిజైన్‌ చేశారు. భూమి లోపల పుట్టుకొచ్చే స్వల్ప ధనులను విని, భూకంపాన్ని ముందుగానే గుర్తించగలదు.

4 / 5
ఈ ఏఐ టెక్నాలజీని ఏడు నెలలపాటు చైనాలోని ఒక ప్రాంతంలో పరీక్షంచగా.. 200 మైళ్ల విస్తీరణంలో ఏర్పడిన 14 భూకంపాలను వారం రోజుల ముందుగానే గుర్తించగలిగింది. దీంతో వెంటనే భూంకపం రానుందని హెచ్చరించింది.

5 / 5
ఈ టెక్నాలజీతో భూకంపాలను 70 శాతం కచ్చితగంగా గుర్తించవచ్చని చెబుతోన్న పరిశోధకులు.. దీంతో వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డుతున్నారు. ఇక ప్రపంచంలోని ఇతర చోట్ల భూకంపాలను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.