Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్‌.. ఇకపై ఆ కాల్స్‌కి చెక్‌..

|

Mar 21, 2024 | 3:37 PM

ప్రముఖ కాలర్‌ ఐడీ సంస్థ ట్రూకాలర్‌కు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్మార్ట్ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను అందిస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్న ట్రూకాలర్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ ఫీచర్‌.? దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రస్తుతం చాలా మందిని స్పామ్‌ కాల్స్‌ సమస్య వేధిస్తోంది. ఈ స్పామ్‌ కాల్స్‌ కారణంగా మోసాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి కాల్స్‌కు కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు.

2 / 5
అయితే ఇలాంటి కాల్స్‌కు చెక్‌ పెట్టడానికే ట్రూ కాలర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ ఫీచర్‌ సహాయంతో స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టొచ్చు.

3 / 5
ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో స్పామ్‌ కాల్‌లను వాటంతటవే బ్లాక్ చేస్తుంది. అంతేకాకుండా స్పామర్‌లు, వాటి సంబంధిత కాల్స్ నుంచి రక్షణ కల్పించేలా ఈ కొత్త ఫీచర్‌ను రూపొందించారు.

4 / 5
మ్యాక్స్‌ అప్‌డేట్‌తో ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ప్రీమియం స్‌బస్క్రైబర్‌ల కోసం తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌ కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

5 / 5
ఈ కొత్త ఫీచర్‌ను యాప్ వెర్షన్ v13.58 లేదా తర్వాతి వెర్షన్‌ యూజర్లు ఈ సేవలను తీసుకురానున్నారు. ట్రూకాలర్‌ యాప్‌లో సెట్టింగ్స్ ఆప్షన్‌లో ఈ ఫీచర్‌ను ఎనెబుల్ చేసుకోవచ్చు. Max ని ఎంచుకున్న తర్వాత , యాప్ స్పామర్‌ల నుండి కాల్‌లను ఆటోమెటిక్‌గా బ్లాక్ చేస్తుంది.