Upcoming Smartphones: మార్చిలో ఎంట్రీ ఇవ్వనున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. టాప్ బ్రాండ్లు.. సూపర్ ఫీచర్లు..

|

Feb 29, 2024 | 7:22 AM

కొత్త ఏడాది వచ్చింది అప్పుడే రెండు నెలలు గడిచిపోయింది. మూడో నెలలో ప్రవేశించబోతున్నాం. మార్చి నెలలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచింగ్ కు రెడీ అయ్యాయి. మీరు మంచి స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే ఈ కథనం మీ కోసమే. వీటిల్లో లాంచింగ్ ముహూర్తం ఫిక్స్ అయిన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు మీకు పరిచయం చేస్తున్నాం. ఫిబ్రవరిలోనే కొన్ని టాప్ బ్రాండ్లు స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. ఐకూ నియో 9 ప్రో, హానర్ ఎక్స్9బీ, ఒప్పో ఎఫ్25 వంటి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మార్చిలో కూడా వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటిల్లో వివో వీ30, నథింగ్ ఫోన్ 2(ఎ), జియోమీ 14, రియల్ మీ 12 ప్లస్ 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఏ55 వంటి మోడళ్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఏ55.. ఈ స్మార్ట్‌ఫోన్ కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ.. మార్చి, ఏప్రిల్ మధ్య ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ హ్యాండ్ సెట్లో 6.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 12జీబీ+256జీబీ స్టోరేజ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

2 / 5
జియోమీ 14.. కంపెనీ ధృవీకరించినట్లుగా జియోమీ 14 భారతదేశంలో 2024, మార్చి 7న విడుదల కానుంది. కీలకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, ఇది 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, లైకా ట్యూన్డ్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ వంటి వాటితో వస్తుందని పలు ఆన్ లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

3 / 5
రియల్ మీ 12 ప్లస్ 5జీ.. టెక్ దిగ్గజం రియల్ మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 12+ 5జీని 2024 మార్చి 6న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. హ్యాండ్‌సెట్ డైమెన్సిటీ 7050 5జీ చిప్‌సెట్‌తో వస్తోంది. లగ్జరీ వాచ్ డిజైన్‌తో సెగ్మెంట్‌లో ఇది మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలియాల్సి ఉంది.

4 / 5
నథింగ్ ఫోన్ 2(ఎ).. ఈ హ్యాండ్‌సెట్ 2024, మార్చి 5న మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్ని ముఖ్య లక్షణాలు, స్పెసిఫికేషన్‌లలో ఆప్టిక్స్ ను పరిశీలిస్తే డ్యూయల్ కెమెరా, 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంది. ఇది 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్ తో వస్తుంది.

5 / 5
వివో వీ30 సిరీస్.. టెక్ దిగ్గజం వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ వివో వీ30 లాంచ్ ను ధ్రవీకరించింది. వివో వీ30తో పాటు వివో వీ 30 ప్రోను ప్రపంచవ్యాప్తంగా 2024, మార్చి 7న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లు జెడ్ఈఐఎస్ఎస్ ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ కెమెరా, మెరుగైన లైటింగ్ కోసం స్టూడియో క్వాలిటీ ఆరా లైట్ వంటి మరెన్నో అద్భుతమైన, ప్రత్యేకమైన కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వీటిల్లో ఉన్నాయి.