
యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్లను చేజారిపోకుండా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఆ కొత్త ఫీచర్లు ఏంటంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో 'రిప్లై వైల్ యూ బ్రౌస్' పేరుతో తీసుకొచ్చిన ఫీచర్ సహాయంతో. బ్రౌజ్ చేస్తున్న సమయంలో ఎవరైనా మెసేజ్ చేస్తే.. రిప్లై ఇవ్వడానికి ఇకపై ఇన్‌బాక్స్‌లో వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మెసేజ్ ఓపెన్ చేసిన రిప్లై ఇచ్చుకోవచ్చు.

Quickly Send To Friends: ఈ ఫీచర్ సహాయంతో కంటెంట్‌ను వేగంగా షేర్ చేసుకోవచ్చు. షేర్ బటన్ నొక్కి పట్టుకోవడం ద్వారా క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్న వారికి కంటెంట్‌ను వేగంగా షేర్ చేసుకోవచ్చు.

See Who's Online: ఈ ఫీచర్ సహాయంతో యాప్ ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది, ఏయే స్నేహితులు ఆన్‌లైన్‌లో ఉన్నారనే వివరాలను ఇన్‌బాక్స్‌లో పైన చూపిస్తుంది. త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Play, pause and re-play: ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సౌకర్యాలను ఎనేబుల్ చేసుకునేలా ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో చాట్‌లో 30 సెకన్ల నిడివితో ఉన్న సాంగ్స్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.

Send silent Messages: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరికైనా మెసేజ్ పంపించే మెసేజ్‌కు ముందు @Silent అని టైప్ చేస్తే మెసేజ్ నోటిఫికేషన్ సైలెంట్‌గా అవతలి వ్యక్తికి చేరుతుంది.