
ఐక్యూ నియో 6 5జీ ఫోన్ వినియోగదారులకు ఓ విలువైన ఎంపికగా పరిగణించవచ్చు. ఈ ఫోన్ అద్భుత పనితీరుతో ఆకట్టుకోవడమే కాకుండా భారీ స్టోరేజ్‌తో ఆకర్షిస్తుంది. మావెరిక్, ఆరెంజ్, డార్క్‌నోవా, సైబర్ రేజ్ కలర్స్‌లో ఉండే ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో వస్తుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర మాత్రం రూ.24,999గా ఉంటుంది.

లావా అగ్ని 2 5జీ ఫోన్ కేవలం రూ.21,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లావా అందించే 5 జీ ఫోన్స్‌లో ఆల్‌రౌండర్‌గా పేర్కొనవచ్చు. 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లు కంచ్చితంగా మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటాయి.

ఒప్పో ఎఫ్ 23 5 జీ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో సరికొత్త రూపంలో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ రెండు ఆకర్షణీయమైన డిజైన్స్‌లో అందుబాటులో ఉంటుంది. బోల్ట్ గోల్డ్, కూల్‌బ్లాక్ రంగుల్లో ఉండే ఈ ఫోన్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.28,999గా ఉంటుంది.

ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ఫోన్ తన రెనో సిరీస్‌కు కొనసాగింపుగా తీసుకువస్తుంది. ఈ సిరీస్‌లో వచ్చే రెనో 10 ప్రో ప్లస్ ఫోన్‌లో ర్యామ్ విస్తరణ సాంకేతికత ఉంటుంది. దాదాపు ఈ ఫోన్ ర్యామ్‌ను 12 జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ గేమింగ్‌తో పాటు వీడియో ప్రాసెసింగ్‌లకు మద్దతునిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.54,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60 ప్రో ఫోన్ ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ మొదటి సారిగా ఈ ఫోన్‌లో 1 టీబీ వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ + 128 జీబీ, 12 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 1 టీబీ వేరియంట్స్‌లో వస్తుంది.