
వివో టీ1 44 డబ్ల్యూ ఫోన్ రూ.15 వేలలోపు దొరికే బెస్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంటుంది. పేరుకు తగినట్లే ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 6.44 అంగుళాల సూపర్ హెచ్‌డీ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ఫొటో లవర్స్‌కు చాలా బాగా నచ్చుతుంది.

వివో వై 21జీ ఫోన్ 6.5 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. మీడియా టెక్ హీలియో జీ 70 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతునిచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.

వివో యూ 20 ఫోన్ 4 జీబీ +64 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ 16 ఎంపీ+8 ఎంపీ +2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే ఈ కూడా ఫోన్ 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

వివో వై 16 ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రియులను ఆకట్టుకు 3 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 13 ఎంపీ + 2 ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తుంది.

వివో వై 17 ఎస్ ఫోన్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. అలాగే ఈ ఫోన్ 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దుతునిస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది.