Smartphones Under 5000: ఐదువేల లోపు అదిరిపోయే ఫోన్లు ఇవే.. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు..

|

Jul 31, 2023 | 8:30 AM

భారతదేశంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటున్నాయి. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయని కొంత మంది ఫీలింగ్‌. కానీ మార్కెట్‌లో రూ.5000 లోపు ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చే ఫోన్లు ఏంటో ఓ లుక్కేద్దాం.

1 / 5
5.5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో వచ్చే నోకియా 2.0 ఫోన్‌ 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీతో వస్తుంది. 8 ఎంపీ బ్యాక్‌ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ వీ 8 ఆధారంగా పని చేసే స్నాప్‌ డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ రావడంతో పని తీరు బాగా ఆకట్టుకుంటుంది.

2 / 5
2 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఐటెల్‌ ఏ 23 ఎస్‌ స్మార్ట్‌ ఫోన్‌లో 3020 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 5 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ గో 11తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌ 15 భాషలకు మద్దతునిస్తుంది. అలాగే మీరు కొనుగోలు చేసిన 100 రోజుల లోపు ఫ్రీ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ను కూడా పొందవచ్చు.

3 / 5
3 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో వచ్చే ఐ కాల్‌ జెడ్‌ 1 4 జీ ఫోన్‌ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. డ్యుయల్‌ 4 జీ సిమ్‌తో పని చేసే ఈ ఫోన్‌ వెనుక వైపు 8 ఎంపీ కెమెరా, ముందు వైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 8.1తో పని చేస్తుంది.

4 / 5
ఐటెల్‌ ఏ 60 ఎస్‌ ఫోన్‌ 4 జీబీ +64 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 8 ఎంపీ బ్యాక్‌ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌ను ఆకర్షణీయంగా చేస్తుంది. 6.6 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లేతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాకర్‌ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది.

5 / 5
మైక్రోమాక్స్‌ భారత్‌ 2 ఫోన్‌ ఆల్‌ ఇన్‌ వన్‌ సూపర్‌ డివైజ్‌గా పని చేస్తుంది. నాలుగు ఇంచుల డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్‌ 5 ఎంపీ బ్యాక్‌ కెమెరాతోపాటు 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో వస్తుంది.