- Telugu News Photo Gallery Technology photos These are the best smartphones under Rs 10,000, check details in telugu
Smartphones Under 10K: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇవి..
అన్ని ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ప్రస్తుత పరిస్థితులలో దాదాపు రూ.30 వేల వరకూ ఖర్చుచేయాలి. కానీ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇంత డబ్బు పెట్టి కొనడం చాలా కష్టం. అయితే అమెజాన్ సంస్థ అతి తక్కువ ధరకే బెస్ట్ ఫోన్లను అందిస్తోంది. అవి కూడా టాప్ బ్రాండ్ల ఫోన్లు కావడం విశేషం. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, నాణ్యమైన కెమెరా, మంచి స్టోరేజీ, ఆధునిక ఫీచర్లు ఉన్నఈ ఫోన్లు కేవలం రూ.10 వేల లోపే అందుబాటులో లభిస్తున్నాయి. పేదలకు కూడా అనువైన ధరలో ఉన్న వీటి ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.
Updated on: Apr 21, 2024 | 3:16 PM

టెక్నో స్పార్క్ 20సీ(TECNO spark 20C).. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఈ స్లైలిష్ ఫోన్ 2023 నవంబర్ లో మార్కెట్ లోకి విడుదలైంది. 6.60 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ వరకూ పెంచుకోగలిగే 16 జీబీ స్టోరేజ్ కెపాసిటీ దీని ప్రత్యేకతలు. ఫోన్ ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 50 ఎంపీ కెమెరా ఆకట్టుకుంటున్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎక్కువ గంటలు పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8,999కి అందుబాటులో ఉంది.

ఒప్పో ఏ18(OPPO A18).. ఒప్పొ ఏ18 ఫోన్ అనేక ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటు ధరలో లభిస్తుంది. 6.56 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, మీడియా టెక్ హెలో జీ85 ప్రాసెసర్ తో పనితీరు బాగుంటుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ స్టోరీజీలతో లభిస్తుంది. ఫ్రంట్ 5 ఎంపీ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. కలర్ వోఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.8.999.

శామ్సంగ్ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13).. ఉత్తమ, ఆధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదలైన ఈ ఫోన్ ఆరు ఆకర్షణీయ రంగులతో, వివిధ స్టోరేజీ వేరియంట్లతో ఆకట్టుకుంటుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరీజీ (1 టీబీ వరకూ పెంచుకోవచ్చు), ఎక్సినోస్ 1280 ప్రాసెసర్, 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ డిస్ ప్లే తో అందుబాటులో ఉంది. 50 , 5, 2 ఎంపీల రియర్ కెమెరా, ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. 15 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎక్కువ గంటలు ఫోన్ పనిచేసేలా చేస్తుంది. ధీని ధర రూ.9,999.

మోటోరోలా ఈ13(Motorola E13).. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి చాయిస్. దీని థిక్, స్టైలిస్ డిజైన్ ఎంతో ఆకట్టుకుంటుంది. 6.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, యూనిసొక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ముందు 5 ఎంపీ, వెనుకభాగంలో 13 ఎంపీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.8599.

రెడ్ మీ 13సీ(Redmi 13C).. రెడ్ మీ సీ సిరీస్ లో లభిస్తున్న అత్యుత్తమ 5జీ ఫోన్ ఇది. 6.74 అంగుళాల డాట్ డ్రాప్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్ సిటీ 6100, 5 జీ ప్రాసెసర్ తో పనితీరు మెరుగ్గా ఉంటుంది. 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరీజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంది. ముందు భాగంలో 5 ఎంపీ, వెనుక 50 ఎంపీ కెమెరాలతో ఫొటోలు స్పష్టంగా తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడిచే ఈ ఫోన్ రూ.8,699కి వినియోగదారులకు అందుబాటులో ఉంది.




