
అసుస్ వివో బుక్ 15.. ఈ జాబితాలో మొదటిది అసుస్ వివో బుక్ 15. ఈ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో ఇంటెల్ కోర్ ఐ5-12500హెచ్ ప్రాసెసర్ ఉంటుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.7 కిలోలు. దీని అసలు ధర రూ.70,990. ఇది అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 46శాతం తగ్గింపుతో కేవలం రూ. 37,990కే లభిస్తోంది.

హెచ్‌పీ విక్టస్ 15.. ఈ జాబితాలో చివరిది ఈ హెచ్ పీ ల్యాప్ టాప్. హెచ్పీ విక్టస్ 15 ల్యాప్ టాప్ లో ఏఎండీ రైజెన్ 5 5600హెచ్ ప్రాసెసర్ ఉంటుంది. 4జీబీ ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్స్ కార్డుతో వస్తుంది. దీని అసలు ధర రూ.54,990, అయితే ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.49,990కి అందుబాటులో ఉంది.

లెనోవో స్మార్ట్ ఛాయిస్ ఐడియాప్యాడ్ గేమింగ్ 3.. గేమింగ్ ప్రియల కోసం తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ ఇది. దీని పేరులో గేమింగ్ అని ఉండటంతో దీని ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటుంది. దీనిలో ఏఎండీ రైజెన్ 5 5500హెచ్ ప్రాసెసర్, 4జీబీ ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్స్ కార్డ్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ. 60,000, అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది రూ. 50,000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది.

డెల్ 15 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్.. అధిక పనితీరు కలిగిన ఈ ల్యాప్ టాప్ విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎవరికైనా సరిపోతుంది. దీనిలో ఇంటెల్ కోర్ ఐ5-1235యూ ప్రాసెసర్ ఉంటుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. తద్వారా మీరు గంటలో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. దీని అసలు ధర రూ. 53,040, కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ పెస్టివల్ సేల్‌లో ఇది 30% తగ్గింపుతో రూ. 36,990కి లభిస్తోంది.

ఏసర్ ఆస్పైర్ లైట్.. ఏసర్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్ టాప్ బడ్జెట్ ధరలో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5-12450హెచ్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. దీని అసలు ధర రూ. 62,990, అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది 40% తగ్గింపుతో రూ. 37,990కి లభిస్తోంది.