Tecno spark 20 pro: రూ. 15వేలలో 108 ఎంపీ కెమెరా.. టెక్నో కొత్త ఫోన్‌ వచ్చేసింది

|

Jun 18, 2024 | 10:37 AM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టెక్నో స్పార్క్‌ 20 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం ఫోన్‌లను తలదన్నే డిజైన్‌, ఫీచర్లతో ఈ ఫోన్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
చైనాకు చెందిన దిగ్గజ సంస్థ టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో స్పార్క్‌ 20 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను జూన్‌ 17వ తేదీన తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిఈ 6080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంబియట్ లైన్‌ సెన్సార్‌ను అందించారు.

3 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్లూటూత్ 5.3 వెర్షన్ , వైఫై 6  వంటి కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. ఇ కంపాస్‌, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జి సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు అందించారు. ఎట్మోస్ డాల్బీ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లను ఇచ్చారు.

4 / 5
టెక్నో స్పార్క్‌ 20 ప్రో 5జీ ఫోన్‌లో 33 వాట్స్‌ సూపర్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు అలాగే ఆప్టికల్ జూమ్‌ కోసం 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.