Tecno camon 20: అదిరిపోయే లుక్‌తో కొత్త స్మార్ట్ ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే

|

Sep 01, 2023 | 8:17 AM

Tecno Camon 20 Avocado Art Edition: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ టెక్నో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో కామన్‌ 20 అవకాడో ఆర్ట్‌ ఎడిషన్‌ పేరుతో ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకమైన బ్యాక్‌ ప్యానల్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. మంచి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 చైనాకు చెందిన టెక్నో కంపెనీ మార్కెట్లోకి టెక్నో కామన్‌ 20 అవకాడో ఆర్ట్ ఎడిషన్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. బ్యాక్‌ ప్యానల్‌పై ఆర్ట్‌ వర్క్‌ డిజైన్ ఉండడం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
లెదర్‌ డిజన్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక అమెజాన్‌తో పాటు టెక్నో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్ ధర రూ. 15,999గా ఉంది.

3 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది.

4 / 5
టెక్నో కామన్‌ 20 స్మార్ట్ ఫోన్‌ 12ఎన్‌ఎమ్‌ మీడియా టెక్‌ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 33 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచచారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఇన్‌ డిస్‌ప్లేగా ఇచ్చారు.