
Asus ROG phone 8 pro: చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 5,500 ఎమ్‌ఎహెచ్‌తో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

Oneplus 12R: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్‌లో 5,500 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ కాలం ఛార్జింగ్ ఇస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరా ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

Redmi Note13 pro: రెడ్‌మీ నోట్13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,050 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. అలాగే 200 మెగాపిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇందుల ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Samsung Galaxy M15: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్15 స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇందులో ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Samsung galaxy s24 ultra: మంచి బ్యాటరీ బ్యాకప్‌తో రూపొందించిన మరో స్మార్ట్ ఫోన్ సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 అల్ట్రా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.8 ఇంచెస్‌తో కూడిన భారీ స్క్రీన్‌ను అందించారు. 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.