ల్యాప్ టాప్ ఉపయోగించే వారిలో ఎక్కువగా వేధించే సమస్య చార్జింగ్. అయితే గేమింగ్, ఇంటర్‌నెట్ వినియోగిస్తే చార్జింగ్ త్వరగా అయిపోతుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఎక్కువ సమయం చార్జింగ్ వస్తుంది అవేంటంటే..
ల్యాప్‌టాప్‌లో ఫుల్ బ్రైట్‌నెస్ పెడితే చార్జింగ్ త్వరగా అయిపోతుంది. కాబట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకుంటే ఎక్కువ కాలం చార్జింగ్ వస్తుంది. అయితే బ్రైట్‌నెస్ ఆటోమెటిక్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నా చార్జింగ్ త్వరగా దిగిపోతుంది.
విండోస్ 10లో ఉండే పవర్ సేవింగ్ సెట్టింగ్స్ చార్జింగ్ ఎక్కువ సేపు వచ్చేలా చేస్తుంది. స్టార్ట్ సెర్చ్‌బార్‌లో పవర్ సేవర్ అని టైప్ చేసి.. మానిటర్ పవరింగ్ ఆఫ్, స్లీప్ మోడ్‌కు త్వరగా వెళ్లడం లాంటి ఆప్షన్లను ఎంచుకోవడం ద్వారా చార్జింగ్ ఆదా చేసుకోవచ్చు.
అవసరం లేని సమయాల్లో వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్‌ను ఆఫ్ చేయడం ద్వారా చార్జింగ్ ఎక్కువ సమయం వస్తుంది. కాబట్టి అవసరం లేని సమయంలో వైర్‌లెస్ నెట్‌వర్క్ ఫీచర్లను ఆఫ్ చేయాలి.
ల్యాప్‌టాప్ వేడెక్కినా చార్జింగ్ త్వరగా డిచార్జ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిడి పడి వేడెక్కితే కాసేపు పక్కన పెట్టి మళ్లీ ఉపయోగించుకోవాలి.