
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో గతేడాది ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ ధరను సామ్‌సంగ్ రూ. 1,54,999గా నిర్ణయించింది. దీంతో కేవలం ప్రీమియం యూజర్లను మాత్రమే టార్గెట్ చేసుకొని తీసుకొచ్చినట్లైంది. అయితే తాజాగా బడ్జెట్ వేరియంట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ 6 ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.

ఈ ఏడాది మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను అందుబాటు ధరలో తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో మరింత దూసుకెళ్లడమే లక్ష్యంగా సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

చైనాకు చెందిన షావోమీ, హానర్, హువాయ్ లాంటి కంపెనీలు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై తర్వాత ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 7.6 ఇంచెస్‌తో కూడిన ప్రైమీ డిస్‌ప్లేను అందించారు. ఇక సెకండరీ స్క్రీన్‌ను 6 ఇంచెస్‌తో ఇచ్చారు.ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.