Galaxy S23: సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 50 వేలలోపే సొంతం చేసుకునే ఛాన్స్‌

|

Feb 13, 2024 | 8:56 AM

కంపెనీలు స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతకు ముందు లాంచ్‌ చేసిన ఫోన్‌లపై ప్రస్తుతం ఆఫర్స్‌ను అందిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ సైతం తన స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 ఫోన్‌పై అందిస్తోన్న డిస్కౌంట్‌కు సంబంధంచిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ గతేడాది అక్టోబర్‌లో గ్యాలక్సీ ఎస్‌23ఎఫ్‌ఈ పేరుతో ఓ ఫోన్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌ ధర రూ. 64,990గా ఉంది. అయితే తాజాగా ఈ ఫోన్‌పై కంపెనీ భారీ ఢిస్కౌంట్‌ను ప్రకటించింది.

2 / 5
ఈ ఫోన్‌కు సంబంధించి 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ. 5 వేల డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత 128 జీబీ వేరియంట్‌ను రూ. 54,990 కాగా 256 జీబీ వేరియంట్‌ను రూ. 64,990కి సొంతం చేసుకోవచ్చు.

3 / 5
ఇదిలా ఉంటే డిస్కౌంట్ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనం రూ. 10 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో 128 జీబీ వేరియంట్‌ను రూ. 50 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

4 / 5
ఇక సామ్‌సంగ్‌ గ్యాలక్జీ ఎస్‌23ఎఫ్‌ఈ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్‌తో కూడిన డైనమిట్ అమోఎల్‌ఈడీ 2ఎక్స్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెస్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. అవుట్‌ డోర్‌ విజిబులిటీ కోసం ఇందలో ప్రత్యేకంగా విజన్‌ బూస్టర్ టెక్నాలజీని అందించారు.

5 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.