Galaxy Z Fold 3: భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన శాంసంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్షన్నర.. అంతలా ఏముందనేగా?

|

Aug 17, 2021 | 3:53 PM

Galaxy Z Fold 3: ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌లలో మరో సంచలానికి తెరతీస్తూ శాంసంగ్‌ కొత్తగా భారత మార్కెట్లోకి గేలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3 ఫోన్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ ఫోన్‌ ధర అక్షరాల రూ. లక్షన్నరకు పైమాటే..

1 / 6
స్మార్ట్‌ ఫోన్‌లు రోజుకో రూపం సంతరించుకుంటున్నాయి. అధునాతన ఫీచర్లను జోడిస్తూ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్స్‌.

2 / 6
 ఫోల్డబుల్‌ ఫోన్లలో ముందు వరుసలో ఉన్న శాంసంగ్‌ ఇటీవల గేలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3 స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా ఈ హైఎండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ భారత మార్కెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.

3 / 6
ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ రూ. 1,49,999గా ఉండగా.. 12 జీబీ ర్యామ్‌ + 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,57,999గా ఉంది. 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ రూ. 84,999, 8 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ రూ. 88,999గా ఉంది.

4 / 6
ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికోసం ఆగస్టు 24 నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకోనున్నారు. సెప్టెంబర్‌ 10 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

5 / 6
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 7.6 అంగుళాల ప్రైమరీ క్యూఎక్స్‌జీఏ ప్లస్ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్‌ సొంతం. ఇక ఫోన్‌ కవర్ డిస్‌ప్లేను అందించారు.

6 / 6
ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టంపై నడిచే ఈ ఫోన్‌లో మూడు రెయిర్‌ కెమెరాలు అందించారు. వీటిలో ఒక్కో కెమెరా 12 మెగా పిక్సెల్‌ ఉంటుంది. వైర్‌తోపాటు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ దీని ప్రత్యేకత. ఇక ఫోల్డ్‌ చేసిన స్క్రీన్‌వైపు అండర్‌ డిస్‌ప్లే కెమెరాను కూడా అందించారు.