
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ తమ కంపెనీకి చెందిన గ్యాలక్సీ వాచ్‌లో కొత్త ఫీచర్‌ను జోడించింది. మెడికేషన్స్ ఫీచర్‌ను యాడ్ చేశారు. సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో భాగమైన ఈ ఫీచర్‌ను భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారు.

ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్ల హెల్త్ అవసరాలను తీరుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా సమయానికి మందులు వేసుకుంటున్నారో, లేదో పరిశీలించడడంలో ఈ కొత్త యాప్ ఉపయోగపడుతుంది.

అలాగే మందులను వేసుకోవటానికి సంబంధించి ఉపయోగకరమైన చిట్కాలనూ సైతం స్మార్ట్ వాచ్‌లో సూచిస్తుంది. ముఖ్యంగా బీపీ, డయాబెటిస్, పీసీఓఎస్, పీసీఓడీ వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారికి ఈ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది.

సమయానికి మందులు వేసుకునేలా యూజర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. మాత్రల్లోని మందుల వివరాలతో పాటు వాటితో ఒనగూరగల దుష్ప్రభావాల గురించి కూడా వివరిస్తుంది.

ఇక ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా.. ఎప్పుడెప్పుడు, ఏయే మందులు వేసుకోవాలో సెట్ చేసుకోవాలి. దీని ప్రకారం సమయానికి యూజర్లను అలర్ట్ చేస్తుంది. మందులు వేసుకునే సమయం రాగానే వెంటనే మిమ్మల్ని వాచ్ అలర్ట్ చేస్తుంది.