Redmi 13 5G: మొదలైన రెడ్‌మీ కొత్త ఫోన్‌ అమ్మకాలు.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరాతో..

|

Jul 12, 2024 | 9:32 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గత కొన్ని రోజుల క్రితం రెడ్‌మీ 13 5జీ ఫోన్‌ను తీసుకురాగా శుక్రవారం తొలి సేల్‌ ప్రారంభమైంది. ఎమ్‌ఐ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, రిటైల్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ13 పేరుతో 5జీఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ఎలాంటి ఆఫర్స్‌ లభిస్తున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
రెడ్‌మీ 13 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్ స్కిన్ వర్షన్ పై పని చేస్తుంది. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్  ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ 4 ఎన్ఎం ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెన్సర్‌ విత్‌ 3 ఎక్స్‌ ఇన్‌ సెన్సర్‌ జూమ్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు

4 / 5
ఇక రెడ్‌మీ 13 5జీ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5030 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను హవేలియన్ బ్లూ, బ్లాక్ డైమండ్, ఆర్చిడ్ పింక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

5 / 5
ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,499గా నిర్ణయించారు. లాచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.