
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 50 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ ఫోన్ మే 24న తొలి సేల్ ప్రారంభమైంది.

మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+డిస్‌ప్లేను అందించారు. 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫోన్ స్క్రీన్ సొంతం.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 15,999గా ఉండగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.17,999గా ఉంది.