
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి రియల్‌మీ 12ఎక్స్ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఈఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

రియల్‌మీ 12ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్ చేశారు. వీటి ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,000కాగా 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,000గా నిర్ణయించారు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ , స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ఈ స్క్రీన్ సొంతం.

ఈ స్మార్ట్ ఫఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 15W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.