
ఇటీవల స్మార్ట్ వాచ్‌ల హవా బాగా నడుస్తోంది. దాదాపు అన్ని టెక్ కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా రియల్ మీ వాచ్2 పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

12 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తోన్న ఈ స్మార్ట్ వాచ్ సహాయంతో.. స్మార్ట్ బల్బులు, రియల్‌మీ డబ్స్ క్యూ, బడ్స్ ఎయిర్ వంటి గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయవచ్చు.

ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నారు. దీని ధర రూ. 4,100గా ఉంది.

1.4 అంగుళాల డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ వాచ్ పిక్సెల్ రిజల్యూషన్ 320x320గా ఉంది. 315 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంలకు సపోర్ట్ చేసే ఈ వాచ్‌లో హార్ట్ బీట్ రేట్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.