చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎమ్6 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 11,999 కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12,999గా ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెట్ రేట్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అందించారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ ఏఐ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోస 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక డస్ట్, వాటర్ రెస్టిస్టెంట్ కోసం ఐపీ53 రేటింగ్‌ను అందించారు.