Poco C75: పోకో నుంచి అదిరిపోయే ఫోన్ వచ్చేస్తోంది.. బడ్జెట్ ధరలో కళ్లు చెదిరే ఫీచర్స్
ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ఫోన్ల సందడి నెలకొంది. కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో సీ75 పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Poco Smartphone
Follow us on
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త ఫోన్ వచ్చింది. గత ఆగస్టులో ఆవిష్కరించిన రెడ్మీ 14 సీ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో సీ75 ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ. 10 వేల బడ్జెట్లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ హీలియో జీ8 అల్ట్రా చిప్సెట్ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ స్కిన్ వెర్షన్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9170కాగా, 8 జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ 10,900గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించార. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ – సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. అంబియెంట్ లైట్ సెన్సర్, యాక్సెలరో మీటర్, ఈ-కంపాస్, వర్చువల్ ప్రాగ్జిమిటీ సెన్సర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.