రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోన్న నేపథ్యంలో ఏ ఫోన్‌ను కొనుగోలు చేయాలో తెలియక తికమక పడుతున్నారా.? అయితే రూ. 25 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్ల వివరాలు మీకోసం..
OnePlus Nord CE 5G: తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ బ్రాండ్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో వన్‌ప్లాస్ నార్డ్ సీఈ 5జీ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ రూ. 24,999కి అందుబాటులో ఉంది. ఇక ఇందులో 6.43 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించిన ఈ ఫోన్‌లో 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇక ఇందులో 64 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
Mi 11 Lite: రూ. 25 వేలలోపు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌లో ఎమ్‌ఐ 11 లైట్ ఒకటి. ఈ ఫోన్‌లో 1080x2400 పిక్సెల్స్‌తో కూడిన 6.55 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 22,499గా ఉంది.
Motorola Edge 20 Fusion: మోటోరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చిందే ఎడ్జ్ 20 ఫ్యూజియన్ ఫోన్. ఇందులో 6.7 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 21,499గా ఉంది. కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు.
iQOO Z3: రూ. 25వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఐక్యూ జెడ్ 3 ఒకటి. ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 4400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 768జీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 20,990గా ఉంది.