
స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ78 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 18 నుంచి రూ. 20 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక ఒప్పో ఏ78 4జీ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్‌ఓపీ చిప్‌సెట్ను అందించారు. అలాగే ఇందులో 67 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ స్క్రీన్ ప్రత్యేకతలు. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ రామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు. వర్చువల్‌గా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. సెక్యూరిటీ విషయానికొస్తే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించారు.