
ఇటీవల వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోన్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా ఒప్పో రెనో 7జెడ్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం థాయ్‌లాండ్ విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్ బరువు 173 గ్రాములు.

కెమెరాకు అధిక ప్రధానత్య ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, మ్యాగ్నటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్ వంటి అధునాత ఫీచర్లు ఈ ఫక్షన్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.