OnePlus Nord CE 3: వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో 108 మెగాపిక్సెల్‌ కెమెరా..

|

Dec 03, 2022 | 12:29 PM

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ భారత మార్కెట్లోకి మరో బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఉండనున్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్‌ ఇటీవల బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం ఫోన్‌లను విడుదల చేస్తూనే మరోవైపు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది.

2 / 5
ఈ నేపథ్యంలోనే తాజాగా వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 3 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ2కి కొనసాగింపుగా వచ్చే ఏడాదిలో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించిన ఇక అధికారిక ప్రకటన రాకముందే ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

3 / 5
 వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో బ్లాక్ ఫినిష్‌తో కూడిన హోల్ పంచ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. వ‌న్‌ప్లస్ ఎక్స్‌ను డిజైన్‌ ఆధారంగా వ‌న్‌ప్లస్ నార్డ్ సీఈ 3 డిజైన్ ఉంటుంద‌ని సమాచారం.

4 / 5
 ఈ ఫోన్‌ 6.7 ఇంచెస్‌ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 695 చిప్‌సెట్‌తో రానుంద‌ని అంచ‌నా. ఇక ఇందులో 67 డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.

5 / 5
ఇందులో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్పీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 25000గా ఉండనున్నట్లు తెలుస్తోంది.