OnePlus 12: లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవుగా..

|

Dec 11, 2023 | 9:46 PM

వన్‌ప్లస్‌ బ్రాండ్‌కి మార్కెట్లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రారంభంలో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ ఆ తర్వాత వరుసగా బడ్జెట్‌ ఫోన్స్‌ని లాంచ్‌ చేస్తూ వచ్చాయి. ఇక తాజాగ మరో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తేనున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి.? వివరాలు మీకోసం..

1 / 5
 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. వన్‌ప్లస్‌ 12 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను భారత్‌తో సహా, గ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇదిలా ఉంటే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 24 జీబీ ర్యామ్‌, టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు.

3 / 5
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట ్‌ ఫోన్‌ కలర్‌ ఓఎస్ 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇక స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన ఎల్టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సోనీ ఎల్‌వైటీ-808 సెన్సర్ ఈ కెమెరా సొంతం. ఇక ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానున్న ఈ ఫోన్‌లో 64-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 48-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి.

5 / 5
సెల్ఫీల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 వాట్స్‌ వైర్‌లైస్‌ ఛార్జింగ్‌తో పాటు, 10 వాట్స్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.