
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ తన బ్రాండ్ నుంచి మొట్ట మొదటి ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ అమెజాన్‌తో పాటు, వన్‌ప్లస్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.

ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ ఆర్డర్స్ మొదలు కానుంది. మే 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభంకానుంది. ధర విషయానికొస్తే 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 37,999. 12GB RAM + 256GB ధర రూ. 39,999గా ఉండనుంది.

ఇక ఈ ట్యాబ్లెట్ ఫీచరల్ విషయానికకొస్తే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌ను అందించారు. 2.8K రిజల్యూషన్, 7:5 స్క్రీన్ రేషియోతో కూడి11.61 ఇంచెస్ భారీ స్క్రీన్‌ను అందించారు.

డాల్బీ విజన్, డాల్బీ ఆట్మోస్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 9510 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ట్యాబ్ ఆక్సీజన్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.