OnePlus Nord 2T: వన్‌ప్లస్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Narender Vaitla |
Updated on: May 08, 2022 | 1:22 PM
OnePlus Nord 2T: ఇటీవల వరుసగా బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న వన్‌ప్లస్ నార్డ్ తాజాగా నార్డ్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
May 08, 2022 | 1:22 PM
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో భాగంగా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం యూరప్‌లో విడుదల చేశారు. త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానుంది.
1 / 5
యూరప్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర 399 యూరోలుగా ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 32,100గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ప్యానెల్ ఇచ్చారు. మీడియా టెక్ డైమిన్‌సిటీ 1300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
3 / 5
వన్‌ప్లస్ నార్డ్ 2టీలో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.