ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్ తాజాగా మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ మెటిల్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.4 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. 550 నిట్స్ బ్రైట్‌నెస్, హెచ్‌డీ రిజల్యూజన్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
అంతేకాకుండా ఈ వాచ్‌ను ప్రీమియం మెటాలిక్‌లో రూపొందించారు. ఈ వాచ్ బ్లూట్ 5.3 కనెక్టివిటీ ట్రూసింగ్ బ్లూటూత్ ఫీచర్‌తో పనిచేస్తుంది. దీంతో బ్లూటూత్ ఈజీగా కనెక్ట్ అవుతుంది.
ఇక ఇందులో SpO2 సెన్సార్, హార్ట్ రేట్ ట్రాకర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్స్‌ను అందించారు. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
అంతేకాకుండా అలారం, రిమైండర్‌లు, వాచ్, వెదర్ అప్‌డేట్స్, కాలిక్యులేటర్ వంటి మరిన్ని ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 7 రోజుల వరకు పని చేస్తుంది.