
ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్‌ఫిట్ హాలో పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

ఈ స్మార్ట్ వాచ్‌లో 1.43 ఇంచెస్ ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 466x466 రిజల్యూషన్ ఈ వాచ్ డిస్‌ప్లే సొంతం. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు.

ఈ స్మార్ట్ వాచ్ ధర విసయానికొస్తే రూ. 3,999కి అందుబాటులో ఉంది. అమెజాన్, నాయిస్‌ఫిట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. స్టేట్‌మెంట్ బ్లాక్, జెట్ బ్లాక్, క్లాసిక్ బ్లాక్, వింటేజ్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, ఫైరీ ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్టెప్ ట్రాకర్ వంటి ఫీచర్లు అందించారు. వాటర్ రెసిస్టెంట్ కోసం IP68-రేట్ అందించారు. బ్యాటరీ చార్జింగ్ గరిష్టంగా 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఈ స్మార్ట్‌వాచ్‌లో నిద్ర, ఒత్తిడి స్థాయిలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ట్రాకింగ్ చేసే వ్యవస్థను అందించారు. అంతేకాకుండా 100 స్పోర్ట్స్, 150కిపైగా వాచ్ ఫేస్‌లను సెట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.