
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో ఇటీవలి కాలంలో వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలో ఎడ్జ్ 30 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈనెలలో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ అందించనున్నారు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రానున్న ఈ ఫోన్‌లో స్క్రీన్ 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ ఇవ్వనుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్‌లతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 60 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

మోటోరోలా ఎడ్జ్ 30 ప్రోలో 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, ఎన్‌ఎఫ్‌సీ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇవ్వనున్నారు.

ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్+12 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 38,000, కాగా 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర రూ. 47,600గా ఉండనుంది.