Motorola Razr 50: తక్కువ ధరలో మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే

|

Jun 18, 2024 | 9:40 AM

ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలన్నీ మడతపెట్టే ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. అయితే వీటి ధరలు భారీగానే ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి బడ్జెట్‌ ధరలో మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటోరోలో మార్కెట్లోకి బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోంది. మోటోరోలో రేజర్‌ 50 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. జూన్‌ 25వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట చైనా మార్కెట్లోకి తీసుకొచ్చి తర్వాత గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేయనున్నారు.

2 / 5
 మోటోరోలా రేజర్‌ 50 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.9 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోల్డ్ చేసిన తర్వాత 3.6 ఇంచెస్‌తో కూడిన కవర్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2640*1080 పిక్సెల్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతంగా చెప్పొచ్చు.

3 / 5
ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8ఎస్‌జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ సెన్సార్‌, 2ఎక్స్‌ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్స్‌ టెలిఫొటో లెన్స్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

5 / 5
ధర విషయానికొస్తే తక్కువ బడ్జెట్‌లో వస్తున్న ఫోల్డబుల్ ఫోన్‌ను చెప్పొచ్చు. మోటోరోలా గతంలో తీసుకొచ్చిన రేజర్‌ 40 ధర ఏకంగా రూ. 89,999గా ఉండగా.. మోటోరోలా రేజర్‌ 50 ధర రూ. 58,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.