
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటారోలా తాజాగా మార్కెట్లోకి మోటో జీ24 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయిన్పటికీ. నెట్టింట ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి లీక్స్ వైరల్ అవుతున్నాయి.

నెట్టింట వైరల్ అవుతోన్న లీక్స్ ఆధారంగా.. ఈ స్మార్ట్ ఫోన్‌ను 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 15,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఐపీఎల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను ఇవ్వనున్నారు. 1612 x 720 పిక్సెల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్‌పై పంచ్ హోల్‌ను ఇవ్వనున్నారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 ఎమ్‌ఎన్ మీడియా టెక్ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోటరోలా ఈ బడ్జెట్ ఫోన్‌ను బ్లాక్, గ్రీన్, పింక్ కలర్స్‌లో తీసుకురానున్నారు.