
ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మంగళవారం కంపెనీ ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్, ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.

లావా బ్లేజ్ ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ జీ37 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ ఏఐ రియర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 10,499కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు లావా ఇ-స్టోర్, అన్ని రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.