
లైవ్ టీవీని ఆన్‌లైన్‌లో చూడడానికి మనకున్న బెస్ట్ ఆప్షన్స్‌లలో జియో టీవీ ఒకటి. జియో యూజర్లందరికీ జియో టీవీ సేవలను ఉచితంగా అందిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు జియో టీవీ యాప్ కేవలం మొబైల్‌కు మాత్రమే పరిమితమైంది. మరి జియో టీవీని ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్‌లో వీక్షించే ఛాన్స్ ఉంటే బాగుంటుంది. ఇందుకోసం కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటంటే..

మొదట మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో బ్లూ స్టాక్స్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.

అనంతరం గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి జియో టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. బ్లూస్టాక్స్ హోం స్క్రీన్‌పై జియో టీవీ యాప్ కనిపిస్తుంది.

అచ్చంగా మొబైల్ ఫోన్‌లో ఓపెన్ చేసినట్లే జియో టీవీ యాప్‌ను ఆపరేటింగ్ చేసుకోవచ్చు.

ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా జియో టీవీ యాప్‌లోని మీ ఫెవరేట్ మూవీస్, షోలను ఎంచక్కా ల్యాప్‌టాప్, పీసీలో వీక్షించవచ్చు.