Itel A70: ఐటెల్‌ నుంచి కొత్త ఫోన్‌.. ఇంత తక్కువ ధరలో ఊహకందని ఫీచర్స్‌

|

Dec 28, 2023 | 10:47 PM

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్‌ ధర స్మార్ట్‌ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. బడ్జెట్‌ పరంగా తక్కువే అయినా ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజీలేకుండా ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన దిగ్గజ కంపెనీలు కొంగొత్త ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐటెల్‌ కంపెనీ మార్కెట్లోకి బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐటెల్‌ ఏ70 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానుంది..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐటెల్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఐటెల్‌ ఏ70 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. బడ్జెట్‌ సెగ్మెంట్‌లో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌ను జనవరి చివరి నాటికి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఐటెల్ ఐటెల్‌ ఏ70 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. 12 జీబీ ర్యామ్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 7,500గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వర్చువల్‌గా ర్యామ్‌ను మరో 4జీబీ వరకు పెంచుకోవచ్చు.

3 / 5
ఈ సెగ్మెంట్‌లో లాంచ్‌ అవుతోన్న బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని ఐటెల్‌ చెబుతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బ్రిలియంట్‌ గోల్డ్‌, స్టైలిష్‌ బ్లాక్‌, ఫీల్డ్‌ గ్రీన్‌, అజూర్ బ్లూ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

4 / 5
ఇక ఐటెల్ ఏ70 ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ యూనిసోక్‌ టీ603 ప్రాసెసర్‌ను అందిస్తారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఐటెల్‌ ఏ70 స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఈ కెమెరా సొంతం. అలాగే వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తారు.