చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐటెల్ ఎస్23+ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనరాక పోయినప్పటికీ, నెట్టింట లీక్ అయిన సమాచారం ఆధారంగా కొన్ని వివరాలు వైరల్ అవుతున్నాయి.
ఐటెల్ ఎస్23+ ధర భారత మార్కెట్‌లో రూ. 15,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ 3డీ డిస్‌ప్లేను అందించనున్నారు. రూ. 15 వేల బడ్జెట్‌లో కర్వ్డ్ డిస్‌ప్లేతో ఫోన్ రావడం విశేషంగా చెప్పొచ్చు. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ దీని సొంతం.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12ఎన్‌ఎమ్ యూనిఎస్‌ఓసీ టీ616ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. డ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12ఎన్‌ఎమ్ యూనిఎస్‌ఓసీ టీ616ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.