iQoo 13: ఐక్యూ నుంచి స్టన్నింగ్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ తెలిస్తే వెంటనే కొనేస్తారు

|

Oct 21, 2024 | 1:40 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఐక్యూ మార్కెట్లోకి త్వరలోనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐక్యూ 13 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట చైనా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌, ఆ తర్వాత భారత మార్కెట్లోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజ ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐక్యూ 13 స్మార్ట్‌ ఫోన్‌ను అక్టోబర్‌ చివరిలో చైనాలో లాంచ్‌ చేయనున్నారు. ఆ తర్వాత ఇండియన్‌ మార్కెట్లోకి ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

2 / 5
ఇదిలా ఉంటే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఫీచర్లకు సంబంధించి కొన్ని లీక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. వాటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఐక్యూ 13 స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేయనుందని తెలుస్తోంది.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 100 వాట్స్‌కు సపోర్ట్ చేసే 6150 కెసాపిటీ బ్యాటరీని ఇవ్వనున్నారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని సమాచారం.