ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల సందడి నడుస్తోంది. ఇంకా 5జీ సేవలు అందుబాటులోకి రాకముందే స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు కొత్త ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వివో కంపెనీ సబ్ బ్రాండ్ అయిన ఐకూ సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఐకూ IQOO Z6 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. వీటి ధరల విషయానికొస్తే.. 4జీబీ రూ. 15,499, 6 జీబీ రూ. 16,999, 8 జీబీ రూ. 17,999గా ఉంది. మార్చి 22 నుంచి అమెజాన్‌తో పాటు ఐకూ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది.
ఈ ఫోన్ విషయానికొస్తే ఇందులో 120 హెడ్చ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
కెమెరాకు అధిక ప్రధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
బ్యాటరీ విషయానికొస్తే ఇంఉదలో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌లో 128 జీబీ ఇంటర్నల్ మెమొరీని అందించారు.