Electricity Tips: ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్ ఏసీ.. ఈ రెండిటిల్లో ఏది తీసుకుంటే కరెంట్ ఆదా అవుతుంది..?

Updated on: May 03, 2026 | 12:09 PM

వేసవి క్రమంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఏసీల వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. అలాగే ఏసీల సేల్స్ కూడా పెరిగిపోతున్నాయి. అయితే ఏ ఏసీ కొనాలి అనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఏసీలలో అనేక రకాలు ఉన్నాయి. ఇన్వర్టర్ ఏసీ మంచిదేనా..?

1 / 5
ప్రస్తుతం ఎండాకాలం వచ్చేయడంతో చాలామంది తమ ఇళ్లల్లో ఏసీలు వినియోగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఇళ్లల్లో ఏసీల వినియోగం పెరిగిపోయింది. అయితే ఏసీలలో చాలా రకాలు ఉంటాయి. ఇన్వర్టర్ ఏసీ, కన్వర్టిబుల్ ఏసీతో పాటు అనేక రకాల ఏసీలు ఉంటాయి. వీటిల్లో ఏది మంచిది అనేది తెలుసుకుందాం.

2 / 5
ఇన్వెర్టర్ ఏసీ, కన్వెర్టిబుల్ ఏసీల మధ్య ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. కూలింగ్, కరెంట్ ఆదాను చేయడంలో తేడాలు ఉన్నాయి. ఇన్వర్టర్ ఏసీలు గది ఉష్ణోగ్రత ఆధారంగా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. కంప్రెసర్‌ను ఎప్పుడూ ఆన్, ఆఫ్ చేయకుండా సర్దుబాటు చేసుకుంటాయి. గది చల్లబడే కొద్ది టెంపరేచర్‌ను స్థిరంగా ఉంచడానికి వేగం తగ్గుతుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవ్వడంతో పాటు సౌండ్ కూడా తగ్గుతుంది.

3 / 5
ఇక కన్వర్టిబుల్ ఏసీ విషయానికొస్తే.. కూలింగ్ పవర్‌ను మనమే సర్టుబాటు చేసుకోవాలి. రూమ్‌లో ఎక్కువమంది ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు హై మోడ్‌లో పెట్టుకోవాలి. తక్కువమంది ఉన్నప్పుడు, రాత్రి సమయంలో లో మోడ్‌లో పెట్టుకోవాలి. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. రెండు ఏసీలు కరెంట్‌ను సేవ్ చేస్తాయి. ఇన్వర్టర్ ఏసీ ఆటోమేటిక్‌గా విద్యుత్‌ను ఆదా చేస్తుంది.

4 / 5
అయితే కన్వర్టిబుల్ ఏసీలో సెట్టింగ్స్‌ను మనమే మార్చుకోవాలి. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంట్ ఆదా చేసుకోవాలంటే ఇన్వర్టర్ ఏసీ మంచిది. పడక గదులు, స్థిరమైన, నిశ్శబ్దమైన శీతలీకరణ అవసరమయ్యే రూమ్‌లకు ఇన్వర్టర్ ఏసీ అనుకూలమైన ప్రదేశం. ఇక నివాస గదులు, జనాల సంఖ్య మారుతూ ఉండే ప్రదేశాలకు కన్వర్టిబుల్ ఏసీ అనువైనది.

5 / 5
ఆటోమేటిక్ పవర్ సేవింగ్, ఒకేలా స్ధిరంగా రూమ్ కూలింగ్ కావాలంటే ఇన్వర్టర్ ఏసీ బెటర్ ఆప్షన్. అలాగే మీరే కూలింగ్‌ను కంట్రోల్ చేసుకోవలానుకుంటే కన్వర్టిబుల్ ఏసీ మంచి ఎంపిక. మీ అవసరాన్ని బట్టి ఏ ఏసీ మంచిదనేది ఎంచుకోండి.

Follow Us